Breaking News
Home / Lifestyle / Business / వస్తున్నాయ్‌ బంగారం బాండ్లు

వస్తున్నాయ్‌ బంగారం బాండ్లు

బంగారం బాండ్లు మళ్లీ మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో సావరిన్‌ బంగారం బాండ్ల (ఎస్‌జీబీ) జారీ ప్రణాళికను భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఆవిష్కరించింది. ఈ ప్రణాళికలో భాగంలో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు ప్రతి నెలా బంగారం బాండ్లను జారీ చేస్తారు. 2019-20 సీరీస్‌లో తొలి విడత సబ్‌స్ర్కిప్షన్‌ నేటి (సోమవారం) నుంచి శుక్రవారం వరకు ఈ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 11న దరఖాస్తుదారులకు బాండ్స్‌ కేటాయిస్తారు.

ధర:
ఈ సీరిస్‌లో జారీ చేసే ఒక్కో గ్రాముకు సమానమైన ఎస్‌జీబీ ధరను ప్రభుత్వం రూ.3,196గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసి డిజిటల్‌ పేమెంట్స్‌, ద్వారా చెల్లింపులు చేస్తే ఒక్కో గ్రాముకు సమానమైన బాండ్‌పై రూ.50 చొప్పున డిస్కౌంట్‌ ఇస్తారు. సీరీస్‌ 2 బంగారం బాండ్లు జూలై 8 నుంచి, సీరీస్‌ 4 బంగారం బాండ్లు ఆగస్టు 5 నుంచి అందుబాటులో ఉంటాయి.

కనీస పెట్టుబడి
బంగారాన్ని వస్తు రూపంలో కొనుగోలు చేయడాన్ని తగ్గించడం ద్వారా దిగుమతులను అదుపులోకి తేవడం, బాండ్ల రూపంలో బంగారంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లను ప్రోత్సహించడం లక్ష్యంగా 2015 నవంబరులో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద బంగారాన్ని బాండ్ల రూపంలో ఇన్వెస్టర్లకు కేటాయిస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక్కో వ్యక్తి కనీసం ఒక గ్రాము నుంచి గరిష్ఠంగా 500 గ్రాముల పసిడికి సమానమైన ఎస్‌జీబీ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఈ బాండ్లను ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్టింగ్‌ చేస్తారు.

ఎక్కడ లభిస్తాయి?
చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు, పేమెంట్‌ బ్యాంకులు మినహా అన్ని షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు, స్టాక్‌హోల్డింగ్‌ కార్పొరేషన్‌, ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో బంగారం బాండ్లు కొనుగోలు చేయవచ్చు.

Check Also

రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Share this on WhatsAppరానున్న 24 గంటల్లో ఉత్తర కాశీ, చమోలీ, డెహ్రాడూన్, పౌరీ, నైనతాల్ జిల్లాలో భారీ నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *