బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 30 వరకు ‘బంపర్ ఆఫర్’ పొడిగింపున్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది సెప్టెంబరులో ప్రవేశపెట్టిన ‘బంపర్ ఆఫర్’ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. రూ.186 నుంచి రూ.2099 మధ్య ఉన్న ప్లాన్లపై రోజుకు 2.2 జీబీ అదనపు డేటాను అందిస్తోంది. ఇప్పుడీ ఆఫర్ను పొడిగించింది. అంతేకాదు, ఈ ఆఫర్లో రూ.1,699, రూ.2099 ప్లాన్లను కూడా చేర్చింది. నిజానికీ ‘బంపర్ ఆఫర్’ ఈనెల 31తో ముగియనుంది.
బీఎస్ఎన్ఎల్ తాజా నిర్ణయంతో రూ.186, రూ.429, రూ.485, రూ.666, రూ.999, రూ.1,699, రూ.2099 ప్లాన్లపై అందుబాటులో ఉన్న డేటాతో పాటు రోజుకు అదనంగా 2.2 జీబీ డేటా ప్రయోజనాలను పొందవచ్చు.
అంటే.. రూ.186, రూ.429, రూ.999 బీఎస్ఎన్ఎల్ రీచార్జ్ ప్లాన్లపై ఇప్పుడు రోజుకు 3.2 జీబీ డేటా లభిస్తుంది. నిజానికి ఈ ప్లాన్లలో లభించేది రోజుకు 1 జీబీనే. దీంతోపాటు రూ.485, రూ.666 రీచార్జ్ ప్లాన్లను కూడా తీసుకొచ్చింది. వీటిలో రోజుకు 3.7 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్లలో నిజానికి లభించేది 1.5 జీబీ డేటానే. 186 రీచార్జ్ ప్లాన్ కాలపరిమితి 28 రోజులు కాగా, రూ.429 ప్లాన్లో 81 రోజులు కాలపరిమితి లభిస్తుంది. రూ.485 ప్లాన్లో 90 రోజులు, రూ.999 ప్లాన్లో 181 రోజులు, రూ.1,699, రూ.2,099 ప్లాన్ల కాలపరిమితి 365 రోజులు.