Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / కాన్సర్ రోగులకు శుభవార్త…

కాన్సర్ రోగులకు శుభవార్త…

అమరావతి: కళ్లకు క్యాన్సర్‌ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి హేమ (4) ఉదంతంపై సీఎం స్పందించారు. మీడియాలో వచ్చిన కథనాలను చూసిన ఆయన వెంటనే హేమకు చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన చిన్నారి హేమ వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం తెలిపారు.గతంలోలా కాకుండా క్యాన్సర్‌ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎలాంటి పరిమితి లేకుండా ఎన్ని విడతలైనా చికిత్స అందించాలన్నారు. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ఈలోగా అత్యవసర కేసులు ఉంటే క్యాన్సర్‌ రోగులకు వెంటనే చికిత్సలు అందించాలని సూచించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *