Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / జెరూసలేం యాత్రికులకు శుభవార్త….

జెరూసలేం యాత్రికులకు శుభవార్త….

అమరావతి: జెరూసలేం వెళ్లే యాత్రికులకు వైసీపీ సర్కార్ శుభవార్త చెప్పింది. యాత్రికులకు ఆర్ధిక సహాయం పెంచుతున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. రూ. 3 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న వారికి ఆర్థిక సహాయం రూ. 40 వేల నుంచి రూ. 60 వేలకు పెంచింది. మరోవైపు.. రూ. 3 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారికి ఆర్థిక సహాయం రూ. 20 వేల నుంచి రూ. 30 వేలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. జెరూసలేం యాత్రికుల ఆర్థిక సహాయం పెంపుపై సీఎం జగన్ అధ్యక్షతన గత నెల 30వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన విషయం విదితమే.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *