Breaking News
Home / Lifestyle / Technology / అట్టర్‌ఫెయిలయిన గూగుల్‌ !

అట్టర్‌ఫెయిలయిన గూగుల్‌ !

గూగుల్‌ సంస్థ ఎన్నో అద్భుతాలు సాధించిందని చెప్పుకుంటాం. అయితే అది అట్టర్‌ఫెయిలయిన విషయాలూ అనేకం. ఉదాహరణకి గూగుల్‌ ప్లస్‌ని ఫేస్‌బుక్‌ను తలదన్నే ఒక గొప్ప సోషల్‌ ప్లాట్‌ఫాంగా తీర్చిదిద్దాలని గూగుల్‌ తల్లకిందులుగా తపస్సు చేసింది. కానీ దాని కల తీరలేదు. తీరుతుందనే ఆశా లేదు. కలగానే మిగిలిపోయిన అలాంటిదే మరో గూగుల్‌ కల గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

ఆమధ్య 2016 అక్టోబర్లో – గూగుల్‌ డే డ్రీమ్‌ (పగటి కల) వ్యూ అన్న పేరుతో వర్చువల్‌ రియాలిటీ (VR) ప్లాట్‌ఫాం ఒకదాన్ని ఎనౌన్స్‌ చేసింది. కొన్ని చీప్‌ VR బాక్సుల్నీ తయారుచేసింది. వీఆర్‌ బాక్సుల గురించి మనకు ఇప్పటికే తెలుసు. ఫోన్‌ని బాక్సులో ఉంచి, కళ్లకి తగిలించుకుని, తలనీ, తలపులు మొత్తం అందులో పెట్టేసి, బయటి ప్రపంచాన్నే మరిచిపోతుంటారు కొందరు. అలా వర్చువల్‌ రియాలిటీ రంగంలో కూడా తన మార్క్‌ వేసేయాలనీ, ముఖ్యంగా తన పిక్సెల్‌ సీరీస్‌ ఫోన్లని ఈ అనుభవానికి తగిన విధంగా మార్చడం ద్వారా జనానికి దగ్గర కావచ్చని గూగుల్‌ భావించింది. ముఖ్యంగా పిక్సెల్‌ సీరీస్‌ ఫోన్లు హిట్‌ కావడానికి వీఆర్‌ ఎంతో కొంత సహాయంగా మారుతుందని ఆశపడింది.

కానీ గూగులొకటి తలిస్తే జనం ఒకటి తలచారు. యాపిల్‌నీ, శామ్‌సంగ్‌నీ, ఇతర ఫోన్లనీ ఆదరించారే తప్ప పిక్సెల్‌ ఫోన్‌ని పెద్దగా పట్టించుకోలేదు. వీఆర్‌ ప్లాట్‌ఫాం పిచ్చ సక్సెస్‌ అవుతుందని అంచనా వేసిన గూగుల్‌ తన పిక్సెల్‌ ఫోన్లలో డే డ్రీమ్‌ వర్చువల్‌ రియాలిటీకి సంబంధించిన సెట్టింగ్సూ హడావిడీ ఇంక్లూడ్‌ చేస్తూ వచ్చింది. కానీ క్రమంగా పరిస్థితి అర్థమవుతూ వచ్చింది. ఇప్పుడు తాజాగా గూగుల్ పిక్సెల్‌ 4 వచ్చింది. ఈ ఫోన్లో గూగుల్‌ డే డ్రీమ్‌ ఊసే లేదు.

మరి ఇంతమాత్రానికే గూగుల్‌ డే డ్రీమ్‌ ప్లాట్‌ ఫాం పూర్తిగా క్లోజయినట్టా? వాళ్లు ఇంకా అఫిషియల్‌ గా చెప్పలేదు కదా? అనకండి. ఆ సంబరం కూడా ముగిసింది. “మేం అంచనా వేసినంత ఆదరణ లేనందువల్ల గూగుల్‌ డే డ్రీమ్‌ని క్లోజ్‌ చేస్తున్నాం” అని స్వయంగా గూగుల్‌ వారే ప్రకటించి ఇక ఆ ప్లాట్‌ఫాం షట్టర్‌ క్లోజ్‌ చేసేశారు. శుభం భూయాత్‌!

మొత్తానికి గూగుల్‌ వారి వర్చువల్‌ రియాలిటీ కల మూడేళ్లు పూర్తయ్యేసరికే మునిగిపోయిందన్నమాట! జనం కళ్లు కప్పలేకపోయిన గూగుల్‌ తన ‘పగటికల’కి స్వస్తి చెప్పాల్సి వచ్చింది. ఎంతటి సంస్థకైనా అన్నీ సక్సెస్‌లు వస్తాయా? అయినా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గకపోతే రేపు మొత్తం మునగాల్సి వస్తుంది. అందుకే గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

Check Also

భారత ప్రభుత్వంతో కలిసి కొనసాగాలని ..?: టిక్‌టాక్

Share this on WhatsAppతమ యాప్‌ను నిషేధిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టిక్‌టాక్ మరోసారి స్పందించింది. భారత ప్రభుత్వ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *