Breaking News
Home / Lifestyle / Business / జియోకు…. గూగుల్ షాక్..

జియోకు…. గూగుల్ షాక్..

న్యూఢిల్లీ: రిలయన్స్ జియోకు షాకిచ్చేందుకు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ రెడీ అయింది. జియో 4జీ ఫోన్‌కు పోటీగా ‘విజ్‌ఫోన్ డబ్ల్యూపీ006’ పేరుతో ఫీచర్‌ఫోన్‌ను తీసుకురాబోతోంది. ఇండోనేషియాలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో గూగుల్ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. జియో ఫోన్‌లానే ఇది కూడా ‘కై ఓఎస్’తోనే పనిచేస్తుంది. గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెర్చ్ వంటి యాప్స్‌ కూడా ఉంటాయి. ఇండోనేషియన్ కరెన్సీలో దీని విలువ 99 వేలు. భారత్ కరెన్సీలో రూ.500. అయితే, ఈ ఫోన్‌ను ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేసేదీ గూగుల్ ఇప్పటి వరకు ప్రకటించలేదు.

కై ఓఎస్‌తో పనిచేసే గూగుల్ ఫోన్‌ 4జీకి సపోర్ట్ చేస్తుంది. జియోఫోన్‌లానే అన్ని ఫీచర్లు ఇందులోఅందుబాటులో ఉన్నాయి. క్వాల్‌కామ్ ఎంఎస్ఎం8905 చిప్‌సెట్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటివి ఉన్నాయి.

జూలై 2017న కియో ఆధారిత జియో ఫోన్లు భారత మార్కెట్లోకి వచ్చాయి. ఓఎస్ మార్కెట్లో ఇవి 15 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి. కై ఓఎస్ కోసం వాట్సాప్ ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ కూడా కై ఓఎస్‌తో పనిచేసే యూట్యూబ్ యాప్‌ను ప్రారంభించింది. జియోను పక్కనపెడితే నోకియా కూడా కై ఓఎస్ ఆధారిత హ్యాండ్‌సెట్ నోకియా 8110ను ఇటీవల విడుదల చేసింది.

Check Also

రాజకీయాలకతీతంగా దాడిని ఖండించాం: రామ్మోహన్‌నాయుడు

Share this on WhatsAppన్యూఢిల్లీ: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి గురించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వివరించారని టీడీపీ ఎంపీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *