Breaking News
Home / Lifestyle / Technology / భారత్‌ వినియోగదారుల కోసం గూగుల్ కొత్త ఫీచర్

భారత్‌ వినియోగదారుల కోసం గూగుల్ కొత్త ఫీచర్

శాన్‌ఫ్రాన్సిస్కో: భారత వినియోగదారులు కోసం గూగుల్ మ్యాప్స్ ఓ నూతన ఫీచర్‌ను ప్రవేశ పెట్టింది. టాక్సీ డ్రైవర్ రాంగ్‌రూట్‌లో వెళ్తుంటే వెంటనే హెచ్చరికలు జారీ చేస్తుంది. ‘ఆఫ్ రూట్’‌గా వ్యవహరించే ఈ ఫిచర్ రాంగ్‌రూట్‌లో 500 మీటర్లు ప్రయాణించగానే వినియోగదరాులను ఎలర్ట్ చేస్తుంది. ఇది యాక్టివేట్ కావాలంటే… వినియోగదారులు మొదట గమ్యస్థానాన్ని ఎంచుకోవాలి. అనంతరం… మెనూలోని స్టే సేఫర్ అనే ఆప్షన్‌లో ఈ ఆఫ్ రూట్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఎంచుకున్న మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్లిన ప్రతిసారి ఇది వినియోగదారుడిని హెచ్చరిస్తుంది. మరో అంశం ఏంటంటే.. దారి తప్పిన ట్యాక్సీకి తిరిగి గమ్యస్థానం చేరుకునే రూట్‌ను మాత్రం ఈ నూతన ఫీచర్ చూపించలేదు. అయితే…ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్న ఈ ఫీచర్ భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో గూగూల్ ఇంకా వెల్లడించలేదు.

Check Also

చంద్రుడిపైకి ప్రయాణం ఇక సులువు అంటున్న అమెజాన్ సంస్థల అధినేత

Share this on WhatsAppరోవర్లను మోసుకెళ్లడం ప్రత్యేకత 2024లో అందుబాటులోకి..! అమెరికాలో ఆవిష్కరించిన జెఫ్‌ బెజోస్‌ వాషింగ్టన్‌: ‘ఆదిత్య 369’ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *