Breaking News
Home / Film News / గోపీచంద్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

గోపీచంద్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

ఫిల్మ్ న్యూస్: తెలుగు తెరపై యాక్షన్ హీరోగాను .. మాస్ హీరోగాను .. ఫ్యామిలీ హీరోగాను గోపీచంద్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన ‘చాణక్య’ ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే గోపీచంద్ తన తదుపరి చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చేశాడు.

సంపత్ నంది దర్శకత్వం వహించనున్న ఈ సినిమా కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన జోడీగా తమన్నా కనిపించనుంది. ఈ ఇద్దరిపై బోయపాటి శ్రీను క్లాప్ ఇవ్వగా ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *