Breaking News
Home / National / ఆర్ధికవృద్ధి, లోటుకట్టడికి ప్రభుత్వం కసరత్తులు….

ఆర్ధికవృద్ధి, లోటుకట్టడికి ప్రభుత్వం కసరత్తులు….

న్యూఢిల్లీ: ఆర్ధికవృద్ధి, లోటుకట్టడికి ప్రభుత్వం తనవంతుగా కసరత్తులు ముమ్మరం చేసింది. వివిధ శాఖలకు సంబంధించిన కార్యదర్శుల కమిటీ ఐదు ప్రభుత్వరంగ సంస్థల్లోని పెట్టుబడుల ఉపసంహరణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనితో సుమారు 60వేల కోట్లు నిధులు సమీకరించుకోవడం ద్వారా ఆర్ధికలోటును కట్టడిచేయవచ్చని అంచనా. పెట్టుబడుల లక్ష్యంలో ఈ మొత్తంతో 60శాతానికి చేరుకోవచ్చని అంచనా. 1.05లక్షలకోట్లు పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంలో ఆరు మెగా విక్రయాలద్వారానే ప్రభుత్వం తన వాటాను నిలబెట్టుకోగలనని ధీమా వ్యక్తం చేస్తోంది. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కాంకార్‌, ఈశాన్య విద్యుత్‌ కార్పొరేషన్‌, టిహెచ్‌డిఎసి సంస్థల్లో వాటాలను విక్రయించేందుకు వీలవుతుంది. పన్ను రాబడులు రూ.1.45 లక్షలకోట్లు తగ్గుతుండటంతో ఇపుడు పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంకు చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. కార్పొరేట్‌ పన్నులు తగ్గింపుతో ఖజానాకు 1.45 లక్షలకోట్లు భారం కలుగుతోంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *