వికారాబాద్ : శివారెడ్డిపేట్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలి. విద్యావాలంటీర్ల వేతనాలు కూడా చెల్లిస్తాం అన్నారు. పాఠశాలల అభివృద్ధిలో దాతల సహకారం తీసుకోవాలి అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.
