Breaking News
Home / States / గవర్నర్‌, సీఎం దీపావళి శుభాకాంక్షలు

గవర్నర్‌, సీఎం దీపావళి శుభాకాంక్షలు

హైదరాబాద్‌: దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ పండుగ ప్రజల్లో వెలుగులు, సంతోషాన్ని నింపాలని ఆకాంక్షించారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల దాకా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ప్రముఖుల నుంచి దీపావళి శుభాకాంక్షలు అందుకోనున్నారు. మంత్రులు ఈటల, హరీశ్‌రావు, పువ్వాడ, గంగుల కమలాకర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ కూడా శుభాకాంక్షలు చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *