Breaking News
Home / States / రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి….

రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి….

సికింద్రాబాద్‌: కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ సికింద్రాబాద్‌ పద్మారావునగర్‌ స్కందగిరి ఆలయంలో సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. గవర్నర్‌ రాకతో ఆలయం వద్ద సందడి నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ సిబ్బంది గవర్నర్‌కు సాదర స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు గవర్నర్‌కు ఆశీర్వచనాలు అందజేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *