చెన్నై: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి నారాయణస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీల మధ్య ఇంకా ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా కామరాజనగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం నారాయణస్వామి హెల్మెట్ ధరించకుండా మోటారు సైకిల్ నడపడాన్ని కిరణ్‌బేడీ తప్పుబడుతూ దానికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేసి ” మోటారు వాహన చట్టాన్ని, సుప్రీంకోర్టు, మద్రాస్ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని, వారిపై చర్యలకు పుదుచ్చేరి డీజీపీకి ఆదేశాలు జారీ అయ్యాయి” అని పేర్కొన్నారు. ఇది రాజకీయంగా పెద్ద దుమారాన్నే లేపింది. ఈ నేపథ్యంలో ఆదివారం కిరణ్‌బేడీ ట్వీట్‌పై నారాయణస్వామి కౌంటర్ ఇచ్చారు.
గతంలో కిరణ్‌బేడీ మోటారు సైకిల్‌పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించని ఫోటోలను పోస్టు చేసి ‘ముందు ఆచరించి ఆ తరువాత ఆరోపించండి’ అని వ్యాఖ్యానించారు. ఇలా ఒకరికొకరు ఆరోపణలు చేసుకోవడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.