Breaking News
Home / States / రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు…

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు…

హైదరాబాద్: దీపావళి సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ‘మీట్ ఆండ్ గ్రీట్’ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. దీపావళి పర్వదినాన అందరికీ మంచి జరగాలని భగవంతున్ని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తిగా అమలు చేయాలనీ, ఇప్పటికే రాజ్‌భవన్‌లో ప్లాస్టిక్‌ను నిషేధించినట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రజలు సైతం ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించాలని ఆదేశించారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *