హైదరాబాద్: గిరిజన సంక్షేమశాఖ అధికారులతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమావేశమయ్యారు. గిరిజన సంక్షేమానికి సంబంధించిన అంశాలపై సమీక్షించిన సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటానని, ములుగు గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్రం ఆమోదం కోసం ప్రయత్నిస్తానని తెలిపారు. సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి బెనహర్ మషేష్ దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా, ఐసీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు.
