Breaking News
Home / Film News / అమితాబ్, రజినీ స్థాయి హీరో ఎన్నికష్టాలు పడ్డాడంటే…

అమితాబ్, రజినీ స్థాయి హీరో ఎన్నికష్టాలు పడ్డాడంటే…

బాలీవుడ్ హీరో గోవిందా నటనకు ముగ్ధులవనివారంటూ ఎవరూ ఉండరు. ఒకప్పుడు అమితాబ్, రజినీల తరువాత గోవిందా సినిమాలకు జనం క్యూకట్టేవారు. అటువంటి ఘనత సాధించిన గోవిందా చాలా కాలం తరువాత తిరిగి బాలీవుడ్‌లో తన సినిమా ‘రంగీలా రాజా’తో హల్‌చల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో పలు విషయాలు ముచ్చటించారు. తాను సినిమాల్లో నటించే తొలిరోజుల్లో అవకాశాలు దొరికేవి కాదని, చాలామంది నిర్మాతలు, దర్శకులు అవకాశాలిస్తామని చెప్పి మోసం చేసేవారని వాపోయారు. ఇటువంటి సందర్భాల్లో వారితో వివాదం జరిగేదని కూడా చెప్పారు. ఒక బెంగాలీ ప్రముఖుడు తన సినిమాలో నటించినందుకు భోజనం పెట్టేవాడని, డబ్బులు ఇచ్చేవాడుకాదని గోవిందా తెలిపారు. కాగా గోవింద్ పెద్ద స్టార్ అయ్యాక కూడా తన స్టార్‌డమ్ ఎంజాయ్ చేయలేదని తెలిపారు. గోవిందా తల్లి ఒక సన్యాసిని. ఆమె ఎప్పుడూ పూజల్లో మునిగితేలేవారు. అందుకే తాను స్టార్‌డమ్‌ను ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదని గోవిందా పేర్కొన్నారు.

Check Also

శింబుకే ముద్దిస్తా……

Share this on WhatsAppసినిమా: శింబుకే ముద్దిస్తానంటోంది నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌. కోలీవుడ్‌లో డేరింగ్‌ నటిగా పేరు తెచ్చుకున్న ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *