Breaking News
Home / Film News / మళ్లీ సంతోషి మాతగా నటించనున్న గ్రేసీ….

మళ్లీ సంతోషి మాతగా నటించనున్న గ్రేసీ….

ఫిల్మ్ న్యూస్: లగాన్‌ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది గ్రేసీ సింగ్‌. అందానికి మారు పేరుగా చెప్పుకునే ఈ నాయికకు తొలి అవకాశమే అద్భుతాలు సృష్టించింది. అమీర్‌ ఖాన్‌ హీరోగా, దర్శకుడు అశుతోష్‌ గోవారికర్‌ రూపొందించిన లగాన్‌ సినిమా అపూర్వ విజయం సాధించింది. భారతీయ సినిమా పరిశ్రమ గుర్తుపెట్టుకునే చిత్రమయింది. ఆస్కార్‌ పురస్కారాలకు మన దేశం నుంచి ఎంపికైంది. ఇంతటి పేరున్న సినిమా చేసిన గ్రేసీ సింగ్‌ ఆ తర్వాత తారగా తన జోరు చూపించింది. సినిమాల్లోకి రాకముందు బుల్లితెర ధారావాహిక సంతోషి మాత ఆధ్యాత్మిక సీరియల్‌లో సంతోషి మాత పాత్రలో కనిపించింది. ఆ పాత్రకు గ్రేసీ సింగ్‌కు బాగా పేరొచ్చింది. ఈ క్రమంలో తెలుగు చిత్రాల్లోనూ నటించింది గ్రేసీ. నాగార్జున సరసన సంతోషం చిత్రంలో నటించి, మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత మోహన్‌ బాబు, శ్రీకాంత్‌ల చిత్రంలోనూ నాయికగా కనిపించింది. గత కొన్నాళ్లుగా సినిమాలు తగ్గించుకున్న గ్రేసీ తాజాగా మళ్లీ సంతోషి మాత పాత్రలో బుల్లితెరపై దర్శనమివ్వబోతోంది. ఈ పాత్ర గురించి గ్రేసీ మాట్లాడుతూ సంతోషి మాత పాత్రలో నటించడం నా అదృష్టం. ఈ సీరియల్ ద్వారా మన జీవితంలో ఎదురయ్యే కష్టాలకు సంతోషి మాత వ్రతం ద్వారా ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో చూపిస్తున్నామని చెప్పింది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *