Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సులకు పచ్చజెండా

ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సులకు పచ్చజెండా

సాంకేతిక విద్యలో వినూత్న ప్రయోగాలు
స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యం
అప్రూవల్‌ ప్రాసెస్‌ హ్యాండ్‌బుక్‌ విడుదల చేసిన ఏఐసీటీఈ

అమరావతి: మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక విద్యలో వినూత్న సంస్కరణలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) శ్రీకారం చుట్టింది. దీర్ఘకాలంగా అమల్లో ఉన్న పలు నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేసింది. 2019-20 విద్యా సంవత్సరపు అప్రూవల్‌ ప్రాసెస్‌ హేండ్‌బుక్‌లో పలు కీలక అంశాలను పొందుపరిచింది. ఆదరణ లేని కోర్సులను వదిలించుకుని కొత్తవి పెట్టుకునేందుకు ఇంజనీరింగ్‌ కళాశాలలకు పచ్చజెండా ఊపింది. ఉపాధికి ఉపయోగపడే స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కోర్సులను ప్రారంభించుకునేందుకు అవకాశం కల్పించింది. రోబో, 3డీ టెక్నాలజీ తదితర కోర్సులను ప్రోత్సహిస్తోంది. ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌, అటానమస్‌ హోదా లేదా డీమ్డ్‌ స్టేటస్‌ నిబంధనలను కఠినతరం చేసింది. తాజా నిబంధనల ప్రకారం ఇంతకుముందున్న సొసైటీలను సెక్షన్‌ 8 కింద కంపెనీగా మార్చుకుని యాజమాన్యపు హక్కు పొందవచ్చు. ఒకే యాజమాన్యం కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలు నిర్వహిస్తున్న సందర్భంలో వాటిని వేర్వేరు సొసైటీల కింద పెడుతున్నాయి. దీంతో వేర్వేరుగా ఫ్యాకల్టీని, మౌలిక సదుపాయాలు, ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇకపై ఒక కిలోమీటర్‌లోపు ఉన్న కాలేజీలను ఒకే సొసైటీ కింద విలీనం చేసుకోవచ్చు. కాగా, ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేసుకునేందుకు భూమి పరిమితిని తగ్గించారు.

కొత్త నిబంధనల ప్రకారం ముందుగా ఎన్‌ఓసీ తీసుకుని మిగులు భూములు, భవనాలు, ల్యాబ్‌లలో సంప్రదాయబద్ధమైన బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులను నిర్వహించుకోవచ్చు. అయితే ఆయా పరిధిలోని విశ్వవిద్యాలయాలు అందుకు సిద్ధంగా ఉండాలి. కొత్త కోర్సులకు సంబంధించి సిలబస్‌, డిపార్ట్‌మెంట్లు వర్సిటీల్లోనూ ఉండాలి. అలా లేకుంటే కొత్త కోర్సులు పెట్టడం సాధ్యం కాదు. ప్రస్తుతం రాష్ట్రంలోని వర్సిటీలు కొత్త కోర్సుల నిర్వహణకు సిద్ధంగా లేవని ఆలిండియా ఇంజనీరింగ్‌ కళాశాలల సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి.కె.రావు అభిప్రాయపడ్డారు.

Check Also

చంద్రబాబును కలిశాక క్లారిటీ ఇచ్చిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

Share this on WhatsAppఅమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుతో తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు  మాజీ ఎమ్మెల్యే వరుపుల రాజా భేటీ అయ్యారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *