Breaking News
Home / World News / థియేటర్లు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్… జులై 20 నుంచి ప్రారంభం

థియేటర్లు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్… జులై 20 నుంచి ప్రారంభం

ప్రపంచంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోని అనేక దేశాల్లో సినిమా థియేటర్లను మూసేసిన సంగతి తెలిసిందే. అయితే, యూరప్ ఖండంలో కరోనా కంట్రోల్ అయ్యింది. దీంతో అక్కడ థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అదే విధంగా అమెరికాలోనూ ఈరోజు నుంచి ఓపెన్ అవుతున్నాయి.

ఇక కరోనా వైరస్ పుట్టిన చైనాలో కూడా థియేటర్లు ఓపెన్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత కొన్ని రోజులుగా చైనాలో కేసులు అతి తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. జనవరి నుంచి చైనాలో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. మార్చి నెలలో థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చినా, కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవుతుండటంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. తాజాగా మరోసారి థియేటర్లు తెరిచేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈనెల 20 వ తేదీ నుంచి చైనాలో థియేటర్లు ఓపెన్ కాబోతున్నాయి. సామాజిక దూరం, మాస్కులు తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటించింది. మార్గదర్శకాలను పాటిస్తూ థియేటర్లు రన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Check Also

భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేసిన నేపాల్!

Share this on WhatsAppతప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు కొన్ని భారతీయ మీడియా చానల్స్‌పై రాజకీయ, చట్ట పరమైన చర్యలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *