Breaking News
Home / National / అత్యాచార నిందితుడికి శుభాకాంక్షలు …

అత్యాచార నిందితుడికి శుభాకాంక్షలు …

న్యూఢిల్లీ : ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే బిజెపి నేత, ఎంపీ సాక్షి మహారాజ్‌ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో ఎంపీగా ఉన్నారు. తన సొంత నియోజకవర్గంలో గురువారం ఒక అత్యాచార బాధితురాలిపై జరిగిన దాడిన ఖండించిన ఆయన ఈ తరువాత కొంత సేపటికే మరో అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే కులదీప్‌ సెంగార్‌కు శుక్రవారం ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆయన వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు బాధితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూనే నిందితులకు శుభాకాంక్షలు చెప్పడం ఏంటని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. సాక్షి మహారాజ్‌ ట్వీట్‌పై కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ స్పందిస్తూ ‘ అత్యాచార కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యేకు బిజెపికి చెందిన ఎంపీ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇటువంటి వారు నేరస్తులపై ఎలా పోరాటం చేయగలరు’ అని ప్రశ్నించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *