Breaking News
Home / National / జీఎస్టీ వసూళ్లు పెంపునకు కమిటీ

జీఎస్టీ వసూళ్లు పెంపునకు కమిటీ

ఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు తగ్గిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. జీఎస్టీ వసూళ్లు పెంపు, చట్టంలోని మార్పులను సూచించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 15 రోజుల్లోగా తొలి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. జీఎస్టీ వసూళ్లు 19 నెలల కనిష్ఠానికి చేరిన నేపథ్యంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం.

2017లో జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చిన కొన్నాళ్లకే వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో వసూళ్లు కేవలం రూ.91,916 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 2.67 శాతం తక్కువ. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. విస్తృత సంస్కరణలతో ముందుకు రావాలని జీఎస్టీ కౌన్సిల్‌ సెక్రటేరియట్‌ కమిటీకి సూచించింది. జీఎస్టీలో చేయాల్సిన మార్పులకు సంబంధించి సిఫార్సులతో రావాలని ఆదేశించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *