Breaking News
Home / National / గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించనున్న అయోధ్య….

గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించనున్న అయోధ్య….

అయోధ్య: అయోధ్య నగరం శనివారం రాత్రి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించనుంది. దీపావళి పండగ సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు అయోధ్య నగరంలో శనివారం దీపోత్సవానికి ఏర్పాట్లు చేసింది. 5.51లక్షల దీపాలతో అయోధ్య నగరాన్ని అలంకరించాలని సీఎం యోగి నిర్ణయించారు. యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఫీజీ రిపబ్లిక్ డిప్యూటీ స్పీకర్ వీణ భట్నాగల్, యూపీ మంత్రులు పాల్గొననున్న ఈ దీపోత్సవంలో శనివారం ఉదయం ఊరేగింపు ప్రారంభమైంది. సాకేత్ కళాశాల నుంచి రామకథ పార్కు వరకు సాగనున్న ఈ ఊరేగింపులో దేశంలోని నలుమూలల నుంచి కళాకారులు పాల్గొంటున్నారు.

సీతారాములను ఆరాధించడంతో పాటు రాముడి పట్టాభిషేకం సాగనుంది. రామలీలా కార్యక్రమంలో ఏడు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. 2,500 మంది విద్యార్థులు రాముడి జీవితంలోని ఘట్టాలతో చిత్రాలు గీశారు. ఈ సందర్భంగా రూ.226 కోట్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం యోగి ప్రారంభించనున్నారు. మొత్తంమీద దీపావళి సందర్భంగా శనివారం రాత్రి చేపట్టనున్న దీపోత్సవం గిన్నిస్ వరల్డ్ రికార్డుగా నిలవనుంది. ఈ అయోధ్య దీపోత్సవాన్ని యూపీ సర్కారు రాష్ట్ర పండగగా ప్రకటించి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *