Breaking News
Home / States / Andhra Pradesh / వీఆర్వో కకృతి బుద్ధి…ప్రజల్లో భయాందోళన

వీఆర్వో కకృతి బుద్ధి…ప్రజల్లో భయాందోళన

గుంటూరు: నిబంధనలను కాపాడాల్సి‌న ప్రభుత్వ అధికారులే బాధ్యత మరిచారు. నిబంధనలు తెలియకనో తనని ఎవరేమి చేస్తార్లే అనే అహంకారమో కానీ బాధ్యతతో మెలగాల్సిన వీఆర్వో దగ్గరుండి ప్రజలతో లాక్‌డౌన్‌ను తుంగలో తొక్కించారు. ఉప్పూడి గ్రామంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

గుంటూరు జిల్లాలోని రేపల్లె మండలం ఉప్పూడి గ్రామ పంచాయతీ వీఆర్వోగా రత్తయ్య విధులు నిర్వహిస్తున్నాడు. అయితే జులై 8న ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తామ‌ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనే ఉప్పూడి వీఆర్వో కకృతి బుద్ధిని బయటపెట్టింది. ఉప్పూడి పంచాయతీలో ఇళ్ళ పట్టాలకు అర్హత సాధించిన పేదలకు పట్టాలు మంజూరు చేస్తున్నామని శనివారం ఉదయం 7 గంటలకు అందరూ రావాలని శుక్రవారం సాయంత్రం గ్రామంలోని వాలంటీర్లతో వీఆర్వో కబురు పంపాడు.

దీంతో శనివారం ఉదయం 7గంటలకే వందల సంఖ్యలో ఉప్పూడి ప్రజలంతా ఇళ్ళ పట్టాల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన పొలం వద్దకు చేరుకున్నారు. వీఆర్వో మాత్రం తాపీగా 9గంటలకు పొలం వద్దకు చేరుకున్నాడు.‌ వీఆర్వో వచ్చిన తర్వాత కానీ ఉప్పూడి ప్రజలకు అసలు విషయం తెలియలేదు. ప్రభుత్వం కొనుగోలు చేసి‌న పొలంలో తమతో హద్దు రాళ్ళు పాతించి.. కూలీ చేపించినట్లు ప్రభుత్వం నుంచి బిల్లు చేసుకోవటానికి మాత్రమే ఇళ్ళ పట్టాలు పేరుతో వీఆర్వో తమను పిలిచాడని ప్రజలు గ్రాహించారు. వెంటనే ప్రజలంతా వీఆర్వో రత్తయ్యపై ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.

అయితే రెండు గంటల పాటు నాలుగు వందల మంది ప్రజలు సామాజిక దూరం పాటించకుండా ఒకేచోట గుమికూడటంతో ఉప్పూడి ప్రజలు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. గుంటూరు జిల్లాలో కరో‌నా విజృంభిస్తోన్న తరుణంలో ప్రభుత్వ నిబంధనలు కాపాడాల్సిన వ్యక్తి రేపల్లె పట్టణానికి అతి సమీపంలో ఉండే తమను లాక్‌డౌన్‌ను ఉల్లంఘించేలా చేయటమేంటని ఉప్పూడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే సర్వం చేసి పేదలకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తామని చెప్తుంటే.. “కూలీ డబ్బుల” బిల్లుల కోసం వీఆర్వో రత్తయ్య నిబంధనలు గాలికొదిలేయటమేంటని ఆలస్యంగా మేల్కొన్న ఉప్పూడి ప్రజలు పశ్నిస్తున్నారు. ఉప్పూడి వీఆర్వో కకృతి బుద్ధిపై జిల్లా కలెక్టర్ విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు.

మరోవైపు సామాజిక దూరం పాటించకుండా వందల సంఖ్యలో గుమికూడిన జనాన్ని గ్రామ యువత వీడియో, ఫోటోలు తీశారు. అయితే తన ఉద్యోగానికి ఎసరు వస్తోందని భయపడిన వీఆర్వో రత్తయ్య ఆ వీడియో‌ను బలవంతంగా డిలీట్ చేయించాడు.

Check Also

వాయుగుండం ప్రభావంతో చురుగ్గా నైరుతి

Share this on WhatsAppఅమరావతి:  పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది మరింత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *