Breaking News
Home / Sports / హామిల్టన్ టీ-20లో పోరాడి ఓడిన భారత్

హామిల్టన్ టీ-20లో పోరాడి ఓడిన భారత్

హామిల్టన్: మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా సెడెన్ పార్క్ వేదికగా జరుగుతున్న ఆఖరి టీ-20లో భారత్‌ పోరాడి ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటంగ్‌కు దిగిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. 213 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. శాంట్‌నర్ వేసిన ఈ ఓవర్ ఐదో బంతికి భారత్ షాట్‌కు ప్రయత్నించి ధవన్(5) మిషెల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన విజయ్ శంకర్ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కివీస్ బౌలింగ్‌ను ధీటుగా ఎదురుకుంటూ.. బౌండరీలతో స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 43 పరుగులు చేసిన శంకర్ శాంట్‌నర్ బౌలింగ్‌లో గ్రాండ్‌హోంకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం రిషబ్ పంత్ 12 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 28 పరుగులు చేసి టిక్‌నర్ బౌలింగ్‌లో విలియమ్‌సన్‌కి క్యాచ్ ఇచ్చి డ్రెస్సింగ్‌ రూం బాటపట్టాడు. ఆ తర్వాత శాంట్‌నర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ(38) కీపర్ సీఫెట్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో కృనాల్ పాండ్యా(26), దినేశ్ కార్తీక్‌(33)లు కలిసి జట్టును గెలిపించేందుకు పోరాటం చేశారు. వీరిద్దరు కలిసి 7వ వికెట్‌కి 63 పరుగులు జోడించారు. కానీ ఫలితం మాత్రం కివీస్‌కు అనుకూలించింది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయడంతో ఈ మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

Check Also

ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు…

Share this on WhatsAppపోర్ట్‌ ఆఫ్ స్పెయిన్: 73వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు దేశ ప్రజలకు స్వాతంత్య్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *