Breaking News
Home / Sports / భారత వికెట్‌ కీపర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు….

భారత వికెట్‌ కీపర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు….

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా గురువారం పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు, అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఐపీఎల్‌ ఫైనల్లో శతకం బాదిన తొలి ఆటగాడిగా సాహా రికార్డు సృష్టించాడు. ధోనీ టెస్టులకు రిటైర్మెంట్ పలికిన తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడి స్థానాన్ని భర్తీ చేసిన సాహా గాయం కారణంగా కొన్ని రోజులు క్రికెట్‌కు దూరమయ్యాడు. 2018 జనవరిలో జట్టుకు దూరమైన అతడు ఈ ఏడాది ఆగస్టులో జరిగిన వెస్టిండీస్‌ పర్యటనకు తిరిగి ఎంపికయ్యాడు. కానీ, తుదిజట్టులో చోటు దక్కలేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కీపర్‌గా అద్భుత ప్రదర్శన చేశాడు. క్లిష్టమైన క్యాచ్‌లను అందుకొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. భారత్ తరఫున సాహా 35 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 1209, వన్డేల్లో 41 పరుగులు చేశాడు.

* స్టంప్స్‌ వెనకు ఉండే సూపర్‌ మ్యాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నీ అసాధారణమైన ప్రదర్శన అలానే కొనసాగించాలి. ఈ ఏడాది మరిన్ని విజయాలను నువ్వు అందుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడి ఆశీర్వాదం నీకు ఉండాలి – మనోజ్‌ తివారి

* పుట్టిన రోజు శుభాకాంక్షలు సాహా. ఈ ఏడాది నువ్వు మరిన్ని క్యాచ్‌లను అందుకుంటావు. అదృష్టం, సంతోషం నీతో ఉండాలని కోరుకుంటున్నా – మయాంక్‌ అగర్వాల్

* హ్యాపీ బర్త్‌డే వృద్ధిమాన్‌ సాహా. నువ్వు ఇలానే కసరత్తులు చేయాలి, క్యాచ్‌లను అందుకోవాలి – బీసీసీఐ

Check Also

భారత్‌–ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పై లయన్‌ వ్యాఖ్య

Share this on WhatsAppసిడ్నీ: విరాట్‌ కోహ్లి నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 టెస్టు సిరీస్‌ను 2–1తో సొంతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *