Breaking News
Home / Sports / మహిళలపై హార్దిక్‌, రాహుల్‌ అనుచిత వ్యాఖ్యలు

మహిళలపై హార్దిక్‌, రాహుల్‌ అనుచిత వ్యాఖ్యలు

బీసీసీఐ షోకాజ్‌
పాండ్యా క్షమాపణ
ఫ్యాన్స్‌ గరం గరం
న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా నోరుజారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఓ షోలో స్ర్తీల గురించి అసభ్యంగా మాట్లాడిన అతడు బీసీసీఐ నుంచి షోకాజ్‌ నోటీస్‌ అందుకున్నాడు. ఈ షోలో హార్దిక్‌తోపాటు పాల్గొన్న కేఎల్‌ రాహుల్‌కు కూడా బోర్డు బుధవారం షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనుకావడంతో మేల్కొన్న పాండ్యా తన వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. బాలీవుడ్‌ దర్శకుడు కరణ్‌ జోహార్‌ నిర్వహించిన ఈ ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో గత ఆదివారం ప్రసారమైంది. వివాదానికి దారితీసిన ఆ షోలో.. ‘మీరు నైట్‌ క్లబ్బుల్లో మహిళల పేర్లు అడగరెందుకు’ అని హార్దిక్‌ను కరణ్‌ ప్రశ్నించాడు. అందు కు పాండ్యా.. ‘పార్టీల్లో నేను సంభాషించే మహిళల పేర్ల ను గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బందిపడుతుంటాను. పార్టీల్లో మహిళల కదలికలు, వారి ప్రవర్తనను గమనించడం నాకు ఇష్టం’ అని బదులిచ్చాడు. తన సెక్సువల్‌ లైఫ్‌ గురించి అడిగిన ప్రశ్నకు ఏమాత్రం సంకోచం లేకుండా పాండ్యా సమాధానమిచ్చాడు. తాను వర్జినిటీ కోల్పోయిన రోజున ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పినట్టు వెల్లడించాడు.

ఇద్దరు క్రికెటర్లను కూడా కరణ్‌.. మహిళలకు సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా అడగడం గమనార్హం. మీరిద్దరూ ఒకే మహిళలతో డేటింగ్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే అన్న ప్రశ్నకు..‘ఆ మహిళకు ఇష్టమైతేనే ముం దుకు సాగుతా’ అని రాహుల్‌ బదులిచ్చాడు. పాండ్యా అయితే ‘అబ్బెబ్బే..అలాంటి పరిస్థితి రాదు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే..ఆ మహిళను ఇష్టపడితే తీసుకువెళ్లిపోవడమే’ అని పాండ్యా కుండబద్ధలుగొట్టాడు. ఇలా పాండ్యా నోటికొచ్చినట్టు మాట్లాడడంతో అభిమానులు ఆగ్రహోదగ్రులయ్యారు. సోషల్‌మీడియాలో హార్దిక్‌ను దుమ్మెత్తి పోశారు. రాహుల్‌ కూడా షోలో పాల్గొన్నా.. అతడు సంయమనం పాటించడంతో అభిమానులు అతడిపై ఎలాంటి విమర్శలు చేయలేదు.

బీసీసీఐ ఆగ్రహం: పాండ్యా వ్యాఖ్యలను బీసీసీఐ కూడా గర్హించింది. అవి స్ర్తీలను కించపరిచేలా ఉన్నాయని అంగీకరించింది. ఆ వ్యాఖ్యలు క్రికెట్‌కే చెడ్డపేరు తెచ్చేలా ఉండడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పాండ్యాతోపాటు రాహుల్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ‘హార్దిక్‌ పాండ్యా, రాహుల్‌కు షోకాజ్‌ పంపాం. 24 గంటల్లో వాటికి సమాధానామివ్వాలని సూచించాం’ అని క్రికెట్‌ పాలక మండలి (సీఓఏ) చీఫ్‌ వినోద్‌ రాయ్‌ తెలిపారు. మొత్తంగా..హార్దిక్‌ పాండ్యా వ్యాఖ్యల నేపథ్యంలో అసలు క్రికెటర్లు ‘క్రికెటేతర షో’లలో పాల్గొనవచ్చా అన్న చర్చలు మొదలయ్యాయి. ‘క్రికెట్‌తో సంబంధంలేని షోలలో ఆటగాళ్లు పాల్గొనేందుకు అనుమతించకూడదనే విషయాన్ని పరిశీలిస్తున్నాం’ అని బోర్డు అధికారి వెల్లడించారు.

షోకాజ్‌కు పాండ్యా స్పందన
తాను ‘ఓపెన్‌’గా మాట్లాడిన మాటలు దుమారం రేపడంతో హతాశుడైన పాండ్యా సోషల్‌ మీడియా ద్వారా బహిరంగ క్షమాపణలు వేడుకున్నాడు. ‘నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించివుంటే వారందరినీ క్షమాపణలు కోరుతున్నా. షోకు అనుగుణంగా మాట్లాడానే తప్ప ఎవరినీ కించపరచడం నా ఉద్దేశం కాదు’ అని ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న అతడు వివరణ ఇచ్చుకున్నాడు. తన వ్యాఖ్యలకు తీవ్రంగా చింతిస్తున్నట్టు షోకాజ్‌ నోటీసుకు స్పందిస్తూ పేర్కొన్నాడు.

Check Also

బ్రేకింగ్ న్యూస్: రిటైర్‌మెంట్ ప్రకటించిన క్రిస్ గేల్

Share this on WhatsAppస్పోర్ట్స్: వెస్టిండీస్ విధ్వసంకర ఆటగాడు క్రిస్ గేల్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *