Breaking News
Home / Politics / ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు, రేవంత్ ….

ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు, రేవంత్ ….

సూర్యాపేట: హుజూర్‌నగర్ నియోజకవర్గం ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఈ నెల 17,18 తేదీల్లో ప్రచారం చేయనున్నారు. 18న జరగనున్న సభకు సీఎం కేసీఆర్ రాకపోవచ్చునని సమాచారం. మంత్రి కేటీఆర్ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో సీఎం పర్యటనలు రద్దవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి 17, 18 తేదీల్లో హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్న మేరకు ఆయన షెడ్యూల్ ఖరారయ్యింది. ఈ నెల 18వతేదీ సాయంత్రంతో ప్రచారం ముగియనుండగా 21న పోలింగ్ జరుగుతుంది. 24న ఫలితాలు వెల్లడవుతాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *