Breaking News
Home / National / హరియాణా సీఎంగా ఖట్టర్‌ నేడు ప్రమాణం!

హరియాణా సీఎంగా ఖట్టర్‌ నేడు ప్రమాణం!

న్యూఢిల్లీ: హరియాణా ముఖ్యమంత్రిగా మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఆదివారం దీపావళి రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో సభ్యులు ఖట్టర్‌ను నాయకుడిగా ఎన్నుకున్నారు. వెంటనే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. ఆదివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. నలభై సీట్లు సాధించిన బీజేపీ పది సీట్లు సాధించిన ప్రాంతీయ పార్టీ జేజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. జేజేపీ అధినేత దుశ్యంత్‌ చౌటాలాకు (దివంగత నేత దేవీలాల్‌ ముని మనుమడు) ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *