న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. 10 గంటలకల్లా సరళి తెలిసిపోతుంది. మధ్యాహ్నానికి పూర్తి వివరాలు ప్రకటిస్తారు. 288 సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ- శివసేన కూటమి 200పై చిలుకు స్థానాలతో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని పది ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. 90 సీట్లున్న హరియాణాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని ఇండియా-టుడే- ఏక్సిస్ పోల్‌తో పాటు మరో చానెల్ అంచనా వేసింది. మిగిలిన అన్ని చానెళ్లూ 70పై చిలుకు సీట్లు ఖాయమనడంతో ఆసక్తికరంగా మారింది. మరో 16 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలూ వెలువడనున్నాయి.
