Breaking News
Home / National / సింగర్‌ అవతారం ఎత్తిన టీమిండియా మాజీ కెప్టెన్…

సింగర్‌ అవతారం ఎత్తిన టీమిండియా మాజీ కెప్టెన్…

జార్ఖండ్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ కొత్త అవతారం ఎత్తారు. కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన ఓ కార్యక్రమంలో స్నేహితులతో కలిసి ధోనీ ఆడిపాడారు. దీంతో తనలో మరో ప్రతిభ కలిగి ఉందని మిస్టర్‌ కూల్‌ నిరూపించారు. ప్రపంచకప్‌ 2019 సెమీస్‌ అనంతరం ధోనీ తాత్కాలిక విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పూర్తి సమయాన్ని ధోనీ తన కుటుంబంతోనే గడుపుతున్నారు. ముఖ్యంగా తన కూతురు జీవాతో కలసి ఆయన సందడి చేస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన కుటుంబంతో కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ తన స్నేహితుడితో కలిసి జుర్మ్‌ అనే బాలివుడ్‌ చిత్రంలోని జబ్‌ కోయ్‌ బాత్‌ బిగాద్‌ జయా అనే పాటను మహీ పాడి అందరిని ఆశ్చర్యపరిచారు. ధోనీ స్నేహితురాలు ప్రీత్‌ సిమోస్‌ ఈ వీడియోను తప్పనిసరి పరిస్థితుల్లో పోస్ట్‌ చేస్తున్నా నన్ను చంపకు అంటూ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేసింది. వీడియో పోస్ట్‌ చేసిన కొద్ది క్షణాల్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *