హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ కౌంటర్ పిటిషన్లో వాడిన భాషపై జగన్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని.. గౌరవనీయ ముఖ్యమంత్రి అని సంబోధించాలని సూచించారు. అలా కాకుండా ఘాటైన పదజాలాన్ని ఎలా వాడతారంటూ జగన్ తరపు న్యాయవాది సీబీఐ పిటిషన్ను తప్పుబట్టారు. అక్రమాస్తుల కేసులో జగన్ హాజరు మినహాయింపు పిటిషన్పై వాదనల నేపథ్యంలో ఈ సంభాషణలు జరిగాయి.
