Breaking News
Home / States / ఆయన మాత్రమే మనస్సుతో స్పందించారు…

ఆయన మాత్రమే మనస్సుతో స్పందించారు…

హైదరాబాద్‌: టీఆర్ఎస్ సీనియర్‌ నేత కేశవరావుతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల ఆవేదన టీఆర్ఎస్ నేతల చెవులకు వినబడటం లేదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నిన్న కేకే విడుదల చేసిన లేఖతో ఆశ పుట్టిందని.. కేశవరావు మాత్రమే మనసుతో స్పందించారని విశ్వేశ్వర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసీ సమ్మెతో అందరూ నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో టీఆర్ఎస్ కు కూడా నష్టమేనన్నారు. సీఎం కేసీఆర్‌ మొండితనంతో పోతున్నారనీ.. పోలీస్‌ శాఖను పక్కన పెట్టుకొని రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *