Breaking News
Home / States / గుప్తనిధులు కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు….

గుప్తనిధులు కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు….

భద్రాద్రి కొత్తగూడెం: గుప్త నిధులు దొరికితే రాత్రికి రాత్రే సంపన్నుడు కావచ్చనే ఆశ… చివరకు ఆ వ్యక్తి ప్రాణాలనే బలిగొంది. ఈ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. అన్నపురెడ్డిపల్లికి చెందిన పఠాన్ హజమత్ అనే వ్యక్తి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి గుప్త నిధుల కోసం అటవీప్రాంతంలోకి వెళ్లారు. అయితే, జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు హజమత్ కు తగిలాయి. దీంతో, విద్యుత్ షాక్ కు గురైన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మరోవైపు, హజమత్ శవాన్ని వేటగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించి హజమత్ తో వెళ్లిన మరో ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *