Breaking News
Home / States / సచివాలయం కూల్చివేతపై విచారణ వాయిదా…

సచివాలయం కూల్చివేతపై విచారణ వాయిదా…

హైదరాబాద్: తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. నూతన సచివాలయం నిర్మాణంపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం తరఫున ఏఏజీ(అడిషనల్ అడ్వకేట్ జనరల్) కోర్టుకు వివరించారు. సచివాలయం నిర్మాణం, భవనాల కూల్చివేతపై ఇప్పటికే కమిటీ వేశామని తెలిపారు. ప్రస్తుత భవానల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు సరిగా లేవని, పార్కింగ్ కూడా సరిగా లేదని కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించి కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను కోర్టుకు ఏఏజీ సమర్పించారు. అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగిన సచివాలయాన్ని ఇప్పుడు ఎందుకు కూల్చివేస్తున్నారని సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తున్న పిటిషనర్ ప్రశ్నించారు. దీని వల్ల వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *