Breaking News
Home / National / చైనాలో భారీ అగ్నిప్రమాదం…

చైనాలో భారీ అగ్నిప్రమాదం…

బీజింగ్‌: చైనాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 19మంది సజీవదహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఎనిమిది మందిని సహాయక సిబ్బంది రక్షించారు. నిత్యావసర వస్తువులు తయారుచేసే ఓ కంపెనీలో ప్రమాదవశాత్తూ ఈ ఘటన సంభవించిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు మృత్యువాతపడ్డారన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. మరోవైపు నిన్న జియాంగ్సూ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 36మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. కమ్యూనిస్టు పాలనలోని చైనా 70వ వార్షికోత్సవానికి సిద్ధమైన వేళ ఈ రెండు భారీ ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *