గుజరాత్: గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కోట్ల రుపాయలు విలువ చేసే వస్తువులతో పాటుగా అధిక శాతంలో ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఆ సమయంలో వర్కర్లు ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రమాదానికి గల ప్రధాన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
