జూరాల: ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న భారీ వరదలకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.350 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.316 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 77 వేల క్యూసెక్కులు కాగా, 70,749 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు నివేదిక విడుదల చేశారు.
