నల్గొండ: శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి విడుదలవుతున్న నీటితో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.50 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సాగర్‌లో ఉన్న నీటి నిల్వ 310.5510 టీఎంసీలుగా ఉంది. సాగర్ ఇన్‌ఫ్లో 10,639 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో కూడా 10,639 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
