Breaking News
Home / States / సాగర్ కు భారీగా వరద నీరు….

సాగర్ కు భారీగా వరద నీరు….

నల్గొండ: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్న నీటితో నాగార్జునసాగర్ నిండుకుండను తలపిస్తోంది. సాగర్ 6 క్రస్ట్‌గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.90 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 311.7462 టీఎంసీల నీరు ఉంది. సాగర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో 96,324 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1,05,210 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు నివేదిక విడుదల చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *