Breaking News
Home / National / భారీ వరదలు…900 మందికి డెంగ్యూ…

భారీ వరదలు…900 మందికి డెంగ్యూ…

బీహార్‌: ఇటీవల బీహార్‌లో భారీ వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి పాట్నాలో డెంగ్యూ ప్రబలినట్లు వచ్చిన ఆందోళనపై ఆయన చర్చించారు. ఆరోగ్యశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం పాట్నాలోనే 900 మందికి డెంగ్యూ సోకినట్లు తేలింది. సెప్టెంబర్‌లో వచ్చిన వరదల తర్వాత ఈ కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 12 మంది అధికారులను సస్పెండ్ చేసి, 22 మంది ఉద్యోగుల జీతాలను నిలిపివేసింది. మరో 12 మంది ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. పాట్నాలో వరద నీరు నిలవడం వల్ల డెంగ్యూ ప్రబలినట్లు ఆరోపణలు ఉన్నాయి. నగరంలో ఎందుకు నీరు నిలిచిపోయిందన్న దానిపై వివరణ ఇవ్వాలని సీఎం నితీశ్ నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లోనూ డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. బీహార్‌లో వచ్చిన తాజా వరదల్లో సుమారు 73 మంది చనిపోయారు. మరో 17 లక్షల మంది వర్షాలకు అతలాకుతలమయ్యారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *