Breaking News
Home / National / బీహార్ లో ముంచెత్తుతున్న వరదలు….

బీహార్ లో ముంచెత్తుతున్న వరదలు….

బీహార్:  గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రెండు దశాబ్దాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో యూపీలో 111 మంది, బీహార్‌లో 27 మంది సహా దేశవ్యాప్తంగా 145 మంది మృత్యువాత పడ్డారు. బీహార్‌లో 20 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. బీహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీ ఇంట్లోకి భారీగా వరద నీరు చేరడంతో ఆయనతో పాటు కుటుంబ సభ్యులను సహాయక సిబ్బంది బోటులో తరలించారు.

యూపీలో గంగా నదికి సమీపంలోని బల్లియా జిల్లా జైలును వరద ముంచెత్తడంతో 900 మంది ఖైదీలను సమీప జైళ్లకు తరలించారు. గయా జిల్లాలోని ఓ గ్రామంలో గోడ కూలి ఐదుగురు చనిపోయారు. బీహార్‌లో వరద బాధితులకు సాయం చేయాలని కాంగ్రెస్‌ కార్యకర్తలను రాహుల్‌గాంధీ కోరారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *