పాట్నా : బీహార్ రాష్ట్రం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలమైపోతున్నది. భారీగా నీరు చేరుతుండటంతో వరదలు ముంచెత్తుతున్నాయి. బీహార్లో ఇప్పటి వరకూ 27 మంది మృతి చెందారు. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని 24 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పాట్నాలో విద్యాంస్థలను రేపటి వరకూ మూసివేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాట్నాలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. ఆహారం, ఔషధాలు అందజేయడానికి రెండు హెలికాప్టర్లను కేటాయించాల్సిందిగా ఐఎఎఫ్ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
