అమరావతి: వచ్చే 24 గంటల్లో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
