Breaking News
Home / States / ఉభయ రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన…

ఉభయ రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన…

హైదరాబాద్‌: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తా కర్ణాటక వరకూ తెలంగాణ, మధ్య కర్ణాటకల మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు పేర్కొంది. అలాగే, మధ్య ఒడిశా ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నట్టు తెలిపింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని నేడు అక్కడక్కడ భారీ వర్షాలు, పలు చోట్లు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం వివరించింది. అలాగే, ఉరుములతో కూడిన జల్లులు కూడా కురుస్తాయని పేర్కొంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *