Breaking News
Home / States / Andhra Pradesh / శ్రీశైలంలో భారీ వర్షం

శ్రీశైలంలో భారీ వర్షం

శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వర్షపు నీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం దాటికి భారీ వృక్షాలు, విద్యుత్ స్థంభాలు నెలకొరిగాయి. దీంతో శ్రీశైలం పరిసరాల్లో కొంతసేపు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు తిరుమలలో కూడా ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి భానుడి భగభగలతో అల్లాడిన భక్తులు మధ్యాహ్నం కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. దాదాపు గంటపాటు వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

Check Also

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ

Share this on WhatsAppఏలూరు: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ (బీఏఎస్‌) పథకంలో 2019-20 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *