అమరావతి : ఎపీలో గురువారం పలు చోట్ల వర్షం కురుస్తోంది. పశ్చిమ గోదావరిలోని పెనుమంట్ర మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చింతలపూడి మండలంలో పొలంలో పని చేస్తుండగా.. పిడుగులు పడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో వైపు.. తూర్పు గోదావరి కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో ఏ క్షణమైనా భారీ వర్షం కురిసే పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. తిరుపతిలోని మదనపల్లెలో భారీ వర్షం పడటంతో అక్కడి లోతట్లు రోడ్లన్నీ నీటి కాలవలను తలపిస్తున్నాయి.
