కృష్ణాజిల్లా: కృష్ణా జిల్లా అవనిగడ్డలో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా ఆరు గంటల పాటు కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా రెవెన్యూ కార్యాలయం, సబ్ ట్రెజరీ, ఆర్అండ్బి గెస్ట్ హౌస్ ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాల్లో వరద నీరు అడుగు మేర నిలిచాయి.
