Breaking News
Home / National / ఎడతెరిపిలేని వర్షం… కొన్ని‌చోట్ల వడగళ్లు…

ఎడతెరిపిలేని వర్షం… కొన్ని‌చోట్ల వడగళ్లు…

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఎన్సీఆర్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనేవుంది. మరో వైపు చలి మరింతగా పెరిగిపోయింది. ఈరోజు ఉదయం వర్షం మరింతగా పెరిగింది. ఉదయం 9 దాటినప్పటికీ వాతావరణం చీకటిగానే ఉంది. కార్యాలయాలకు, పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లేవారంతా పలు అవస్థలు పడుతున్నారు. దీనికితోడు పలు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచిపోయింది. పలుచోట్ల వడగళ్లు పడ్డాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే వర్షం కారణంగా కాలుష్యం నుంచి ఉపశమనం లభిస్తుందని పలువురు భావిస్తున్నారు. వాతావరణశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 24 వరకూ బలమైన గాలులతో పాటు వర్షం కురిసే అవకాశాలున్నాయి. భారీవర్షం కారణంగా నజఫ్‌గడ్‌లో ఒక గొడౌన్ గోడకూలి ఇద్దరు మృతి చెందారు.

Check Also

విక్రమ్ కోసం కొనసాగుతున్న ‘నాసా’ ప్రయత్నాలు….

Share this on WhatsAppబెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కలల ప్రాజెక్టు చంద్రయాన్‌2కి చెందిన విక్రమ్ ల్యాండర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *