న్యూఢిల్లీ : దేశంలోని కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో మంగళవారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. భారీవర్షాలు కురియనున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఛత్తీస్ఘడ్ ఒడిశా, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, ఢిల్లీ ప్రాంతాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు పిడుగులు పడే ప్రమాదముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరంలో మంగళవారం ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు వివరించారు.
