Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / పలు జిల్లాల్లో భారీ వర్షాలు…

పలు జిల్లాల్లో భారీ వర్షాలు…

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కోస్తా, ఉత్తరాంధ్రతోపాటు రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. బుధ, గురువారాల్లోనూ కోస్తా, ఉత్తారాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. పలు చోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *